బెంగళూరు: కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మోఘల్ పాలకుడు ఔరంగజేబు (Aurangzeb) జయంతి సందర్భంగా గుర్తు తెలియని వక్తులు బెళగావిలోని షాహూ నగర్లో ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అఖండ భారత్‌ను నిర్మించిన నిజమైన పాలకుడని, సుల్తాన్-ఇ-హింద్ అని అందులో పేర్కొన్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మత ఘర్షణలు సృష్టించడానికే దీనిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ బ్యానర్‌ను తొలిగించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంతో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమనిగినట్లు కనిపించింది.
అయితే బ్యానర్ నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ మరో వర్గానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అక్కడే ఉన్న హిందూ జాతీయ వాది అయి వీర్ సావర్కర్ బ్యానర్‌ను ఎందుకు తీసేయలేదని నిలదీశారు. ఆ బ్యానర్‌ను వెంటనే తొలగించేకపోతే తామే ఆ పని చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.