Madan Dilawar : నాగ్పూర్ (Nagpur) లో హింసాత్మక ఘటనలపై రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) మదన్ దిలావర్ (Madan Dilawar) స్పందించారు. జాతీయవాదులు, దేశంపై భక్తి ఉన్న వాళ్లు ఎవరైనా నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Auragazeb) సమాధిని కూల్చివేయాలని డిమాండ్ చేస్తారని ఆయన అన్నారు. ఔరంగజేబు, బాబర్ (Babar), అక్బర్ (Akbar) అంతా ఆక్రమణదారులను, వేల మందిని హతమార్చిన హంతకులని విమర్శించారు.
అలాంటి హంతకులను పొగడటం కరెక్టు కాదని దిలావర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆక్రమణదారులు, దోపిడీదారులు, గూండాల గుర్తులు, జ్ఞాపకాలను కచ్చితంగా తుడిచివేయాల్సిందేనని అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వైరి వర్గాల మధ్య అక్కడ హింసాత్మ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ మంత్రి పైవిధంగా స్పందించారు.