న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పౌరుల కేంద్రాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి జరిగింది. ఫుజైరా ఆయిల్ ఫ్యాక్టరీపై కూడా అటాక్ జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు భారతీయులు గాయడప్డారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ఖండించింది. సీజ్ఫైర్ వేళ దాడులు జరగడం ఆమోదయోగ్యం కాదు అని భారత్ పేర్కొన్నది. తక్షణమే పశ్చిమాసియాలో కాల్పులను విరమించాలని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. సంప్రదింపులు, దౌత్యం ద్వారానే శాంతి, స్థిరత్వం వస్తుందన్న నమ్మకం తమకు ఉందని భారత్ పేర్కొన్నది.
అయితే యూఏఈ కేంద్రాలపై ఇరాన్ కవ్వింపు దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఫుజైరాపై అటాక్ జరిగిన సమయంలో ముగ్గురు భారతీయ వ్యక్తులు గాయపడినట్లు ఇండియన్ ఎంబసీ కన్ఫర్మ్ చేసింది. సరైన వైద్యం, సహకారం అందించేందుకు స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకలు తిరగాలని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. సమస్యను శాంతియుతంగా పరిష్కరించే అంశంలో సహకరిచేందుకు భారత్ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది.
సాధారణ పౌరుల నివాస ప్రాంతాల వద్ద ప్రొజెక్టైల్‌ను ఇంటర్సెప్ట్ చేస్తున్న సందర్భంలో భారతీయులు గాయపడి ఉంటారని యూఏఈ అధికారులు వెల్లడించారు. రెచ్చగొట్టే దాడులను తాము కూడా ఖండిస్తున్నట్లు యూఏఈ చెప్పింది.
Our statement on the attack on Fujairah ⬇️
🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ
— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026