ముంబై: అప్పులు చెల్లించటంలో మహిళలు నిజాయితీగా ఉంటారట. అవును.. ట్రాన్స్యూనియన్ సిబిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించేవారిలో పురుషులు 51 శాతంమందే ఉండగా, మహిళల్లో 57 శాతంమంది ఉన్నారట. ఇటీవలికాలంలో మహిళలు ఉద్యోగాలు చేయటం పెరగటంతో వినియోగ వస్తువులతోపాటు పర్సనల్ లోన్లు తీసుకోవటం పెరిగిందని సర్వేలో తేలింది. భారత్లో 2022లో రుణం కోసం 8.6 కోట్ల మంది మహిళలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు దరఖాస్తు చేసుకొన్నారట.