అమృత్సర్, మే 12: రెండు వేర్వేరు చోట్ల అధికారులు సుమారు 255 కోట్ల రూపాయల హెరాయిన్‌ను పట్టుకున్నారు. గుజరాత్లో 217 కోట్లు, అమృత్సర్ సరిహద్దు వద్ద 38.85 కోట్ల సరుకును స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ బృందం జరిపిన దాడిలో రాజ్‌కోట్ జిల్లాలో 217 కోట్ల విలువైన 31 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ ఒకరిని అరెస్ట్ చేశారు.
చీపురు కట్టలలో డ్రగ్స్‌తో నింపిన చిన్న వెదురు కర్రలు ఉంచి రవాణా చేస్తుండగా అమృత్‌సర్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద రూ.38.36 కోట్ల విలువైన 5.5 కేజీల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అఫ్గాన్‌ను, భారతీయురాలైన ఆయన భార్యను అరెస్ట్ చేశారు.