PM Modi | భారత్‌లో 90 కోట్ల మంది ఓటర్లు.. యూరప్ మొత్తం కలిపినా 64 కోట్ల మంది లేరు : ప్రధాని మోదీ
PM Modi | భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని.. యూరప్ దేశాల (Europe Countries) జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని వ్యాఖ్యానించారు.
PM Modi : భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని.. యూరప్ దేశాల (Europe Countries) జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. నెదర్లాండ్స్ (Nedarlands) పర్యటనలో ఉన్న ఆయన హేగ్ నగరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం, మాటామంతీ నిర్వహించారు.
నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని, నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
భారత్‌లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటిందని తెలిపారు. సెమీకండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసిందని అన్నారు. భారత్‌లో సెమీ కండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. మేడిన్ ఇండియా చిప్‌లు తయారవుతున్నాయని, ఏఐ సమ్మిట్, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని ప్రధాని గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

