ముంబై: సుదూర ప్రాంతాలకు వెళ్లే 16 విమానాలను ఎయిరిండియా శుక్రవారం దారి మళ్లించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో, ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు, మరికొన్ని అవి బయల్దేరిన విమానాశ్రయానికి తిరిగి చేరుకుంటాయని వెల్లడించింది. తమ విమాన సమయాల్లో మార్పులు ఉంటాయని ఇండిగో తెలిపింది.