Charaideo Maidam: యునెస్కో వారసత్వ సంపద లిస్టులో అహోమ్ సమాధులు
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల్పించారు. దీని పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: అస్సాంలో ఉన్న చరాయిడియో మైదమ్(Charaideo Maidam) సమాధి కట్టడాలను.. యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో(UNESCO World Heritage list) చేర్చారు. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతాన్ని చేర్చారు. ఈజిప్టు పిరమిడ్స్ తరహాలో.. తూర్పు అస్సాంను పాలించిన అహోమ్ చక్రవర్తలు ఇక్కడ తమ సమాధులను ఏర్పాటు చేశారు. చరాయిడియో మైదమ్ను చక్రవర్తలు ఖనన ప్రదేశంగా పిలుస్తారు. మైదమ్ అంటే పుట్ట తరహాలో భూమిపై ఎత్తుగా ఉంటుంది.
అయితే ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ ప్రాంతం యూనెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. తూర్పు అస్సాం ప్రాంతాన్ని సుమారు 600 ఏళ్ల పాటు అహోమ్ రాజులు పాలించారు. బ్రిటీషర్ల రాకకు పూర్వం ఇక్కడ ఆ రాజుల పాలనే ఉండేంది. పిరమిడ్స్ తరహాలో ఇక్కడ బొంద గడ్డలను నిర్మించారు.
A matter of immense joy and pride for India!
The Moidams at Charaideo showcase the glorious Ahom culture, which places utmost reverence to ancestors. I hope more people learn about the great Ahom rule and culture.
Glad that the Moidams join the #WorldHeritage List. https://t.co/DyyH2nHfCF
— Narendra Modi (@narendramodi) July 26, 2024
అహోమ్ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు దక్కడం సంతోషకరమని, ఇది దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ తెలిపారు. చరాయిడియో మైదమ్.. అహోమ్ సంస్కృతిని ప్రతిబింబింప చేస్తుందని, మన పూర్వీకులకు అమితమైన గౌరవాన్ని తెలియజేస్తుందని, అహోమ్ చక్రవర్తులు, వారి పాలన గురించి ప్రజలు మరింత తెలుసుకుంటారని ఆశిస్తున్నట్లు మోదీ తన ఎక్స్‌లో తెలిపారు.
చరాయిడియో మైదమ్ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్టులో చేర్చే నిర్ణయాన్ని భారత్‌లో జరిగిన 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో తీసుకున్నారు. ఇది అస్సాంకు గొప్ప విజయమని ఆ రాష్ట్ర సీఎం హేమంత బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్.. మొయిదమ్ గురించి ప్రతిపాదన చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

