Watch: విద్యార్థులను కొట్టి హింసించిన టీచర్.. ఒక స్టూడెంట్ను కిటికిలోంచి బయటకు విసిరేందుకు యత్నం
Assam Teacher Beats Students | ఒక ఉపాధ్యాయుడు క్లాస్‌లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇది వెలుగులోకి వచ్చింది.
గువాహతి: ఒక ఉపాధ్యాయుడు క్లాస్‌లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇది వెలుగులోకి వచ్చింది. (Assam Teacher Beats Students) ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని చరాయిదేవ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మథురాపూర్ టీ గార్డెన్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అరిఫుల్ ఇస్లాం, క్లాస్‌లోని విద్యార్థులను శారీరకంగా హింసించాడు. పిల్లలను కొట్టడంతో పాటు వేధింపులకు గురి చేశాడు. ఒక స్టూడెంట్ను తరగతి గది కిటికీ నుంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. కొంతమంది విద్యార్థులతో క్లాస్‌లో మసాజ్ చేయించుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
కాగా, ఆ క్లాస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను స్కూల్ హెడ్మాస్టార్ పరిశీలించారు. దీంతో టీచర్ అరిఫుల్, విద్యార్థులను దారుణంగా హింసించిన తీరు వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు అస్సాం టీ ట్రైబ్స్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన మథురాపూర్ సబ్ బ్రాంచ్ దీనిపై స్పందించింది. ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చరాయిదేవ్ జిల్లా కమిషనర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. లేనిపక్షంలో నిరసన చేస్తామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో టీచర్ అరిఫుల్పై ఫిర్యాదు అందటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు విద్యాశాఖ కూడా ఆ టీచర్‌పై ప్రత్యేక విచారణ చేపట్టింది. టీచర్ వేధింపులకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A shocking incident has been reported from Charaideo district in Assam, where a primary school teacher has been arrested after CCTV footage allegedly showed him brutally assaulting students inside a classroom.
The incident took place at Mathurapur Tea Estate Primary School, also… pic.twitter.com/KiPDYcnYqq
— Hate Detector 🔍 (@HateDetectors) May 14, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

