గువాహటి: భార్యను చంపి, తలను ఫ్రిజ్లో దాచిన ఘటన అస్సాంలో కలకలం రేపింది. హతిగావ్లోని బాసిష్ట పూర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్లో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలిని రియా తాలూక్దార్ గోస్వామిగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త రామానుజన్ గోస్వామిని పోలీసులకు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి గోస్వామి దంపతుల ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా వారికి రియా మృతదేహం కనిపించింది. ఆమె తలను నల్లటి పాలిథిన్ సంచిలో ఉంచి, ఫ్రిజ్లో దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె వేళ్లు కూడా నరికివేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు, ఓ పదునైన ఆయుధంతో పాటు మరికొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కారణమేమిటన్నది ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు.