గౌహతి, ఆగస్టు 23: పశు సంవర్ధక రంగంలో అస్సాం ఒక అద్భుతమైన ఘట్టాన్ని నమోదు చేసింది. అస్సాంలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ సైంటిస్టులు దేశీయ ‘లఖిమి’ జాతికి చెందిన ప్రపంచపు తొలి ఐవీఎఫ్ ఆడ దూడను విజయవంతంగా సృష్టించారు. ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జన్మించటం ప్రపంచంలోనే మొదటిసారి.
అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ ఘనత సాధించారు. సైంటిస్టులను సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’ వేదికగా శనివారం అభినందించారు.