గౌహతి : తమ మతం ఆమోదించినప్పటికీ.. రెండో వివాహం చేసుకోవాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు. భార్య బతికుండగా ఉద్యోగులు రెండో వివాహం చేసుకోవడాన్ని ఇటీవల ప్రభుత్వం నిషేధించింది.
అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగి రెండో వివాహం చేసుకోవడానికి సర్వీస్ నిబంధనలు అంగీకరించవని ఆయన చెప్పారు. అయితే కొన్ని మతాల్లో రెండో వివాహం తప్పుకాదని, అలాంటప్పుడు రూల్స్ ప్రకారం అలాంటి ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.