న్యూఢిల్లీ: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు.. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి మరణించాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో శనివారం చోటుచేసుకొన్నది. పోలీసుల కథనం ప్రకారం.. నాగావ్ జిల్లాలో గురువారం ట్యూషన్ వెళ్లి తిరిగి వస్తున్న ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తఫుజల్ అనే వ్యక్తిని విచారణ అనంతరం క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసేందుకు నేరం జరిగిన చోటుకు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకొన్న నిందితుడు సమీపంలోని చెరువులో దూకాడు.