అసోంలో ఈనెల 22 వరకు కరోనా ఆంక్షలు పొడిగింపు
కరోనా ఆంక్షలు| కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో ఆంక్షలను సడలించింది.

గువాహటి: కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈ నెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటించింది. అయితే కొన్ని జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో ఆంక్షలను సడలించింది. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్డీఎంఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జూన్ 16 ఉదయం 5 గంటల నుంచి ఈనెల 22 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను సమీక్షించామని, కొన్ని జిల్లాల్లో బాధితుల సంఖ్య, కరోనా వ్యాప్తి తగ్గుతున్నదని పేర్కొన్నది. అయినప్పటికీ పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని వెల్లడించింది.
రాష్ట్రంలో నిన్న 3678 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,63,175కు చేరాయి. ఇందులో 4,18,472 మంది బాధితులు కోలుకోగా, 40,709 మంది చికిత్స పొందుతున్నారు. మరో 3994 మంది మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

