Assam Congress | మిలిటెంట్స్‌తో భేటీ : హిమంత బిశ్వ శర్మ అరెస్ట్‌కు కాంగ్రెస్ డిమాండ్
కుకి మిలిటెంట్స్‌ను కలిసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్ట్ చేయాలని అసోం కాంగ్రెస్ (Assam Congress) చీఫ్ భూపేన్ బోరా డిమాండ్ చేశారు.
గువహటి : కుకి మిలిటెంట్స్‌ను కలిసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్ట్ చేయాలని అసోం కాంగ్రెస్ (Assam Congress) చీఫ్ భూపేన్ బోరా డిమాండ్ చేశారు. శర్మ ఆదివారం కుకీ మిలిటెంట్ గ్రూపులను కలిసి కేంద్ర ప్రభుత్వం తరపున శాంతి, సామరస్య ప్రణాళికలను వారి ముందుంచారు.
కుకి మిలిటెంట్స్‌తో రాజ్యాంగవిరుద్ధంగా సంబంధాలు నెరిపిన హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గువహటిలో నిరాహార దీక్ష చేపట్టింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఓ ముఖ్యమంత్రి మణిపూర్ ఎన్నికల్లో గెలిచేందుకు కుకి మిలిటెంట్స్‌ను కలవడం తాము తొలిసారిగా విన్నామని బోరా పేర్కొన్నారు.
మిలిటెంట్ గ్రూప్ నేత స్వయంగా ఈ విషయం వెల్లడించారని, శర్మపై బీజేపీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా అని తాము వేచిచూస్తున్నామని కాంగ్రెస్ నేత అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అప్పటి ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్‌చార్జ్‌లు రాంమాధవ్, హిమంత బిశ్వ శర్మ కుకి సంస్ధల మద్దతు తీసుకున్నారని కుకి సంస్ధల్లో ఒకటైన ఓ సంస్ధ నేత 2019లో కేంద్ర మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ప్రస్తావించారని బోరా పేర్కొన్నారు.
Read More :
Senthil Balaji | విపక్ష నేతలను వేధిస్తున్న మోదీ సర్కార్ : మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్‌పై ఖర్గే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

