దిస్పూర్: ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్లో మరణించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదని, అది ఉద్దేశ పూర్వక హత్య అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం శాసనసభలో ప్రకటించారు. ఈ హత్య వెనక ఉన్న కారణం అస్సామీలను దిగ్భ్రాంతికి గురి చేస్తుందని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలు తెలిశాయన్నారు. ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసిందన్నారు. ‘నిందితుడొకరు గార్గ్ను హత్య చేశారు. మిగతావాళ్లు అతడికి సాయం చేశారు’ అని హిమంత చెప్పారు.