న్యూఢిల్లీ : ముస్లింలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం ఆ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజా చర్యతో ఆయనను అరెస్ట్ చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేశారు.
సీఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజ్‌ను ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. రైఫిల్ తూటాలు, పుర్రె టోపీలు, గడ్డాలు ఉన్న పురుషుల చిత్రాలను తాకుతున్నట్టు వీడియోలో కన్పించింది. కనికరం లేదు, మీరు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లలేదు? వంటి అస్సామీ టెక్స్ మెసేజ్‌లు కూడా ఉన్నాయి.