గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్ డీలర్స్‌పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను శని, ఆదివారాల్లో డిఫు, గోలఘాట్, బర్హంపూర్, హజోయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ధ్వంసం చేశారు. ఈ ఏడాది మే 10 నుంచి జూలై 15 మధ్యకాలంలో రాష్ట్ర పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం 874 కేసులను నమోదు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,493 మంది మాదకద్రవ్యాల డీలర్లను అరెస్టు చేసి, దాదాపు రూ. 163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని సీఎం శర్మ తెలిపారు. అక్రమ డ్రగ్స్ వ్యాపారం ఒక అంటువ్యాధి అని, ఇందులో పాల్గొన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆదివారం బర్హంపూర్‌లో జరిగిన డ్రగ్స్ ధ్వంసం కార్యక్రమంలో ఆయన హెచ్చరించారు. నాగాన్‌లో నిర్వహించిన డ్రగ్స్ డిస్పోజల్ కార్యక్రమంలో సీఎం శర్మ స్వయంగా బుల్డోజర్ నడిపి డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు.
#WATCH | Assam Chief Minister Himanta Biswa Sarma drives a bulldozer during a programme on 'Seized Drugs Disposal' in Nagaon. pic.twitter.com/3iNc3Ud3BY
— ANI (@ANI) July 18, 2021