గువాహటి: ‘అస్సాం బహు భార్యత్వ నిషేధ బిల్లు, 2025’ను అస్సాం శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడేండ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాలకు, షెడ్యూల్ గిరిజనులకు ఈ చట్టం నుంచి మినహాయింపును ఇచ్చారు. ఈ బిల్లుపై చర్చను విపక్షాలు బహిష్కరించాయి. ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.