Gujarat | గుజరాత్ (Gujarat)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి బంధువులు దారుణంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గుజరాత్లో గల భావ్‌నగర్ (Bhavnagar) జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గదిలోకి వచ్చే ముందు షూ తొలగించి (remove shoes) రావాలని రోగి బంధువులకు వైద్యుడు జల్దీప్ సింగ్ గోహిల్ సూచించాడు. దీంతో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రోగి బంధువులు సదరు వైద్యుడిపై దాడి చేశారు (patients relative thrash doctor). కింద పడేసి చితకొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. సెప్టెంబర్ 12వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;
Altercation erupts over removing shoes.
A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward.”#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024
Also Read..
Uttam Kumar Reddy | ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సుకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Khairathabad Ganesh | ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Atishi | ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు.. అది కేజ్రీవాలే : అతిశీ ఫస్ట్ రియాక్షన్