న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు చెందిన దివంగత ఏఎస్ఐ బాబు రామ్‌కు ఈ ఏడాది అశోక్ చక్ర పురస్కారాన్ని ప్రకటించారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఆయన కుటుంబసభ్యులకు అశోక చక్ర అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. బాబు రామ్ భార్య రీనా రాణి, కుమారుడు మానిక్‌లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవాళ 73వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాజ్‌పథ్‌లో జరిగిన వేడుకలో ఈ అవార్డును ప్రజెంట్ చేశారు. అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అశోక చక్రను ఇస్తారు. అయితే 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల్ని బాబు రామ్ హతమార్చారు. ఆ తర్వాత ఆయన ఉగ్ర తూటాలకు బలయ్యారు.
ASI Babu Ram conferred with Ashok Chakra posthumously for "displaying valour & exemplary raw courage" during an anti-terror op in Srinagar.
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) January 26, 2022
His wife Rina Rani & son Manik receive the award from President Ram Nath Kovind.
#RepublicDayWithDoordarshan pic.twitter.com/RLWsfSUXXi