పనాజీ: మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు(Ashok Gajapathi Raju).. ఇవాళ గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. పీఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే .. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 11.30 నిమిషాలకు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.
అశోక్ గజపతి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయవేత్తగా ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. గతంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. మోదీ క్యాబినెట్లో విమానయానశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
మహారాజా అలక్‌నారాయణ విద్యాసంస్థలను అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అశోక్ గజపతి రాజు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో కీలక మంత్రిత్వ శాఖలను ఆయన చేపట్టారు.