న్యూఢిల్లీ, జూలై 14: తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత ఆషిం కుమార్ ఘోష్ హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్థానంలో అషిం కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు.
కాగా, దత్తాత్రేయ ఈ పదవిలో 2021 జూలై 15 నుంచి ఉన్నారు. కొత్తగా నియమితులైన వారు ఆయా పదవుల్లో చార్జి స్వీకరించినప్పటి నుంచి ఈ నియామకాలు అమలులోకి వస్తాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజు(74) ప్రస్తుతమున్న పీఎస్ శ్రీధరన్ పిైళ్లె స్థానంలో గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. అశోక్ 2014 నుంచి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వ్యవహరించారు.