Asaduddin Owaisi | ముస్లింలకు ఇక మతస్వేచ్ఛ వర్తించదా..? : అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని సహరాన్పూర్ కలెక్టరేట్ (Saharanpur Collectorate) ప్రాంగణంలోని మసీదు (Masque) కూల్చివేతపై ఎంఐఎం అధినేత (MiM Chief) అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక వర్తించదా..? అని ప్రశ్నించారు.
Asaduddin Owaisi : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని సహరాన్పూర్ కలెక్టరేట్ (Saharanpur Collectorate) ప్రాంగణంలోని మసీదు (Masque) కూల్చివేతపై ఎంఐఎం అధినేత (MiM Chief) అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక వర్తించదా..? అని ప్రశ్నించారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు మసీదును కూల్చివేసినట్లు తెలిపారు. మసీదు ఉనికిని నిరూపించే 1911 నాటి రికార్డులు కమిటీ వద్ద ఉన్నాయని ఓవైసీ చెప్పారు.
శతాబ్దానికిపైగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని ఒవైసీ తెలిపారు. ఇది ‘వక్ఫ్ బై యూజర్’ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఏళ్ల తరబడి అక్కడ ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిపై హక్కు ఎలా కోరుతుందని ఓవైసీ ప్రశ్నించారు. ‘మసీదు ముందే ఉంది.. కలెక్టరేట్ ఆ తర్వాత వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. మసీదును కూల్చేందుకు బుల్డోజర్ ఉపయోగించడాన్ని తప్పుబట్టారు. ‘నా మత స్వేచ్ఛ మీ దయపై ఆధారపడి లేదు’ అని స్పష్టంచేశారు.
కోర్టు ఆదేశాల మేరకే కూల్చివేత చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మసీదును ప్రభుత్వ భూమిపై ఉన్న అక్రమ నిర్మాణంగా కోర్టు గతంలో ప్రకటించింది. ముస్లిం పక్షం దాఖలు చేసిన అప్పీల్‌ను జిల్లా న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. దాంతో శనివారం భారీ భద్రత మధ్య కూల్చివేత చేపట్టారు. ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. సహారన్‌పుర్ వెళ్లేందుకు సిద్ధమైన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్‌ను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఆమె నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కూడా కూల్చివేతను తప్పుబట్టారు. భూమి రికార్డులు, వక్ఫ్ బోర్డు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిణామంతో పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

