Shivraj Singh Chouhan: శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పట్టుకుని ఏడ్చేసిన మహిళలు.. వీడియో
Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌ను పట్టుకుని స్థానిక మహిళలు ఏడ్చేశారు. ఎక్కడికీ వెళ్లవద్దు అంటూ బోరున విలపించారు. ఆ మహిళలను శివరాజ్ సింగ్ ఓదార్చారు. ఎంపీని విడిచి, తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు.
భోపాల్: భయ్యా మీరెక్కడికి వెళ్లొద్దు.. మామా మీరెక్కడికి వెళ్లకండి అంటూ.. మహిళలు, అమ్మాయిలు.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను పట్టుకుని ఏడ్చేశారు. ఈ ఘటన విదిషా నియోజకవర్గంలో జరిగింది. ఆ స్థానం నుంచి ఆయన గతంలో పోటీ చేసి గెలిచారు. మహిళల కోసం ఎన్నో స్కీమ్‌లను అమలు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వల్ల.. సీఎం పోస్టుకు దూరం అయ్యారు. అయితే విదిషాలో టూర్ చేస్తున్న సమయంలో.. ఆయన్ను అక్కడి మహిళలు భావోద్వేగంతో హత్తుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్లవద్దు అంటూ ఏడ్చేశారు.
Emotional Moment for people on Shivraj Singh Chouhan’s departure. pic.twitter.com/158te7zrcc
— 💪🎭..Rai ji..💪🎭 (@Vinod_r108) December 12, 2023
శివరాజ్ సింగ్‌కు సీఎం పదవి ఇవ్వకుండా.. బీజేపీ అధిష్టానం ఆ పోస్టుకు మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే శివరాజ్‌ను కేంద్ర సర్కార్‌లోకి తీసుకునే యోచనలో బీజేపీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానిక మహిళలు కన్నీరుమున్నీరయ్యారు. ఏడుస్తున్న మహిళల్ని శివరాజ్ సింగ్ చౌహాన్ ఓదార్చారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని ఆ మహిళలకు నచ్చజెప్పారు.
నవంబర్ 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 స్థానాలు నెగ్గి అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఉజ్జెయిన్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ను సీఎంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈసారి చౌహాన్ .. బుద్నీ స్థానం నుంచి లక్ష మెజారిటీతో గెలుపొందారు. లాడ్లీ బెహనా లాంటి స్కీమ్‌లను శివరాజ్ ప్రవేశపెట్టారు. 18 ఏళ్ల పాటు ఆయన సీఎంగా చేశారు. చత్తీస్ఘడ్ బీజేపీ సీఎం రమణ్ సింగ్ రికార్డును ఆయన బ్రేక్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

