Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్.. రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతం
Gaganyaan Mission: గగన్‌యాన్ మిషన్‌కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్‌ను ఇస్రో ఇవాళ విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ కంగ్రాట్స్ తెలిపారు.
శ్రీహరికోట : గగన్‌యాన్ మిషన్(Gaganyaan Mission) ద్వారా.. మానవసహిత అంతరిక్ష యాత్రకు భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యోమగాములను నింగిలోకి పంపాలనుకుంటున్న ఇస్రో.. ఇవాళ మరో కీలక అడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ కంగ్రాట్స్ తెలిపారు. ఈ మైలురాయి ద్వారా గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో సంసిద్దమైందన్న సంకేతాన్ని ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇవాళ ఈ పరీక్ష చేపట్టారు. వచ్చే సంవత్సరం వ్యోమగాములను ఇస్రో నింగిలోకి పంపాలనుకుంటున్న విషయం తెలిసిందే. గగన్‌యాన్ మిషన్‌లో ఎయిర్ డ్రాప్ పరీక్ష అత్యంత కీలకమైంది. సిబ్బంది ఎస్కేప్, రికవరీ సిస్టమ్ గురించి ఈ పరీక్ష చేపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఆస్ట్రోనాట్ రక్షణే ధ్యేయంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్‌ను నిర్వహించారు.
Congratulations #ISRO for the successful accomplishment of Second Integrated Air Drop Test (IADT-02) for #Gaganyaan, India’s first Human Space flight scheduled next year.
The second Integrated Air Drop Test (IADT-02) was successfully conducted at Satish Dhawan Space Station…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 10, 2026
తొలిసారి ఐఏడీటీ పరీక్షను గత ఏడాది ఆగస్టు 24వ తేదీన నిర్వహించారు. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన కొన్ని ప్రయోగాలు ఆలస్యం అవుతున్నాయి. దీంట్లో ఐఏడీటీ పరీక్ష కూడా ఒకటి. క్రూ మాడ్యూల్ సుమారు 5 కిలోల టన్నులు బరువు ఉంటుంది. అయితే వ్యోమగాములు దిగుతున్న సమయంలో అది బాహ్య వాతావరణాన్ని తట్టుకునే రీతిలో మాడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. పారాచూట్ వ్యవస్థను కూడా ఈ మాడ్యూల్ ద్వారా పరీక్షిస్తారు. వ్యోమగాములు సురక్షితంగా భూమిపై ల్యాండ్ కావాలంటే ఇది చాలా కీలకమైన అంశం. మొదటిసారి ఐఏడీటీ పరీక్షను సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి పరీక్షించారు. చినూక్ హెలికాప్టర్ ద్వారా ఆ పరీక్ష చేపట్టారు. ఇస్రో, ఐఏఎఫ్, డీఆర్డీవో, నేవీ, కోస్టు గార్డ్లు ఈ పరీక్షలో పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

