ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో అరుదైన సంఘటన జరిగింది. పొరపాటున కుకీ ప్రాంతంలోకి ప్రవేశించిన మైతీ యవకులను ప్రాణాలతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన తర్వాత తొలిసారి మైతీ, కుకీ సభ్యులు ఒకరినొకరు హత్తు కున్నారు. (Meitei-Kuki Communities Hug) సెప్టెంబర్ 27న మైతీ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరో మైతీ వ్యక్తితో కలిసి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు అస్సాం రైఫిల్స్ క్యాంప్‌నకు బయలుదేరారు. అయితే గూగుల్ మ్యాప్స్పై ఆధారపడిన వారు పొరపాటున కాంగ్పోక్పిలోని కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో కుకీ గ్రామ వలంటీర్లు వారిని నిర్బంధించారు. ఒక వ్యక్తిని తర్వాత విడుదల చేశారు.
కాగా, ఇద్దరు మైతీ వ్యక్తుల నిర్బంధం గురించి సీఎం బీరెన్ సింగ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్పోక్పి జిల్లాలోని కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ కమిటీల గిరిజన ఐక్యత సంఘం (సీవోటీయూ) మధ్యవర్తిత్వం వహించింది. ఇరు వర్గాలతో చర్చలు జరిపింది. ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ-జో ఖైదీలందరినీ వారి ఆధిపత్య ప్రాంతమైన చురచంద్‌పూర్‌కు తరలించాలని, కాంగ్పోక్పి జిల్లాలోని ఫైలెంగ్మోంగ్లో కొత్త పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇద్దరు మైతీలను నిర్బంధించిన కుకీ గ్రామ వలంటీర్లు డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వంతో చర్చల తర్వాత ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ, జో వర్గాలకు చెందిన 11 మందిని సపర్మీనాలోని జైలుకు తరలించారు. అలాగే ఫైలెంగ్మాంగ్లో పోలీస్ స్టేషన్‌ను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న ఇద్దరు మైతీ వ్యక్తులను కుకీ గ్రామ వలంటీర్లు విడుదల చేశారు.
కాగా, విడుదల చేసిన ఇద్దరు మైతీ వ్యక్తులను కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ గురువారం పోలీసులకు అప్పగించింది. ఈ సందర్భంగా ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు మొదలైన 17 నెలల తర్వాత మైతీ, కుకీ సభ్యులు తొలిసారి ఒకరినొకరు హత్తుకున్నారు. మైతీ యువకులు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర అధికారులకు సీఎం బీరెన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.
The two young men abducted in Kangpokpi on 27th September, 2024 have been safely brought back to the custody of @manipur_police . I sincerely appreciate everyone from both the state and central government who worked tirelessly to ensure their safe return. Your efforts are deeply…
— N. Biren Singh (@NBirenSingh) October 3, 2024
The Two #Meitei youths abducted by the CoTU ( kuki Tribal Union) since 27/9/2024 have been safely released and handed over to the SP,kangpokpidistrict Police!@PMOIndia @narendramodi @AmitShah @NBirenSingh pic.twitter.com/Kg6ivqD43k
— Viidyarani Moirangthem (@VidyaMoirangth2) October 3, 2024