న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) కొందరు మహిళా ఎంపీలతో కలిసి ఫొటో దిగారు. ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీలతో 2019తోపాటు తాజాగా దిగిన ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2019 త్రోబాక్ ఫొటోలో మహిళా ఎంపీలు మోయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జోతిమణి, తమిజాచి తంగపాండియన్ ఉన్నారు. తాజా ఫొటోలో లోక్‌సభ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా జతకలిశారు. ‘యోధులు తిరిగి వచ్చారు’ అన్న క్యాప్షన్‌తో ఈ రెండు ఫొటోలను మహువా మోయిత్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 74 మంది మహిళలు విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అత్యధికంగా 11 మంది మహిళా ఎంపీలు గెలిచారు. అయితే 2019లో ఎన్నికైన 78 మంది మహిళా ఎంపీలతో పోల్చితే ఈసారి వీరి సంఖ్య స్వల్పంగా తగ్గింది.
The warriors are back ! 2024 vs 2019@KanimozhiDMK @dimpleyadav @supriya_sule @jothims @ThamizhachiTh pic.twitter.com/D1lJGHFFhb
— Mahua Moitra (@MahuaMoitra) June 24, 2024