Arvind Kejriwal | వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్ (Aam aadmi party) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మందిని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని (no possibility of any alliance) స్పష్టం చేశారు.
‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు’ అని కేజ్రీ వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ సీట్ల పంపకం కోసం ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. కూటమిలోని కాంగ్రెస్కు 15 సీట్లు, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీ.. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చారు.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
Also Read..
Tirumala | ఈ నెల 16 నుంచి ధర్మాసం.. తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై
South Korea: కస్టడీలోనే దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం
Mancherial | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మంచిర్యాలలో విషాదం