మలివాల్‌పై దాడి నిజమే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసింది. స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డ కేజ్రీవాల్ పీఎస్ బిభవ్‌కుమార్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తాజాగా ప్రకటించారు.
- నిందితుడిపై కఠిన చర్యలు
- ఆప్ నేత సంజయ్ సింగ్
న్యూఢిల్లీ, మే 14: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని తీవ్రంగా కుదిపేసింది. స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడ్డ కేజ్రీవాల్ పీఎస్ బిభవ్‌కుమార్‌పై కఠిన చర్య తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తాజాగా ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుశ్చర్యను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.
‘స్వాతి మలివాల్ సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. డ్రాయింగ్ గదిలో సీఎం కోసం ఎదురుచూస్తుండగా, ఆమెతో పీఎస్ బిభవ్‌కుమార్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం కేజ్రీవాల్‌కు తెలిసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు’ అని చెప్పారు. ఘటనకు సంబంధించి స్వాతి మలివాల్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రాతపూర్వక ఫిర్యాదు ఆమె నుంచి అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

