Supreme Court | ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నమోదు చేసిన అవినీతి కేసులో అరెస్టును, ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. బెంచ్‌లో జస్టిస్ ఉజ్వల్ భుయాన్ సైతం ఉన్నారు. ఈ నెల 5న కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.