సర్జికల్ స్ట్రయిక్స్‌పై ఆధారాలు అక్కర్లేదు: రాహుల్ గాంధీ
Rahul Gandhi on Surgical strikes: ఆర్మీపై నమ్మకం ఉంది. వాళ్ల అసాధారణ పనితీరును గుర్తిస్తున్నాం. సర్జికల్ స్ట్రయిక్స్‌పై వాళ్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నామని రాహుల్ తెలిపారు.
జమ్మూ: యురి ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం పాక్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ సర్కార్ అన్ని అబద్ధాలు చెబుతోందని, సర్జికల్ స్ట్రయిక్స్ చెందిన ఆధారాలు చూపించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ ఆరోపించారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలను ఇవాళ రాహుల్ గాంధీ ఖండించారు. జమ్మూలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు తెలిపారు. దిగ్విజయ్‌వి అర్ధరహిత వ్యాఖ్యలు అని రాహుల్ అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను తాము వ్యతిరేకిస్తున్నామని, పార్టీ అభిప్రాయాలు.. దిగ్విజయ్ అభిప్రాయాల కన్నా ముఖ్యమైనవని రాహుల్ అన్నారు.
చర్చల ద్వారా పార్టీ అభిప్రాయాలు ఉత్పన్నం అవుతాయని, కానీ దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన స్వంత అభిప్రాయాలని, ఆ అభిప్రాయాలకు పార్టీతో సంబంధం లేదని, సైనిక దళాల పనితీరు విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, ఆ దళాలు అసాధారణ రీతిలో పనిచేస్తున్నాయని, వాళ్లు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ తెలిపారు. సోమవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్.. సర్జికల్ స్ట్రయిక్స్‌పై కామెంట్ చేశారు. దీంతో ఆ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నష్టనిరవారణ చర్యలు చేపట్టారు.
జమ్మూకశ్మీర్‌లోని యురి బేస్‌పై 2016లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోయారు. ఆ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2019లో పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు అటాక్ చేశారు. పాక్‌లోని జైషే గ్రూపు ఆ దాడి చేసింది. ఆ దాడి తర్వాత భారత సైన్యం .. పాక్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసింది.
#WATCH | We don't appreciate Digvijaya Singh's personal views. His views are outlying views. We are absolutely clear that the Armed Forces do their job exceptionally well and they do not need to provide proof of that: Congress MP Rahul Gandhi pic.twitter.com/O67iRg8aNk
— ANI (@ANI) January 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

