Pahalgham Attack : పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. కశ్మీర్‌కు చెందిన మొహమ్మద్ యూసుఫ్ కఠారియాను బుధవారం జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుల్గాం ప్రాంతానికి చెందిన ఇతడు పహల్గాం దాడికి పాల్పడిన ది రెసిస్టంట్ ఫ్రంట్ ముష్కరులకు కఠారియా ఆయుధాలు సమకూర్చాడు. ఇతడిని లష్కరే తోయిబా ( Lashkar-e-Taiba) ఉగ్రవాదిగా గుర్తించారు పోలీసులు. దాదాపు ఐదు నెలలుగా టెర్రరిస్టులకు సాయం చేసిన వ్యక్తి కోసం వెతుకుతుకున్న పోలీసులు ఎట్టకేలకు కఠారియాను పట్టుకున్నారు. అతడిని 14 రోజులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
కఠారియా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. అంతేకాదు స్థానికంగా పిల్లలకు పాఠాలు కూడా చెబుతుంటాడు. కొన్ని నెలల క్రితమే అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. కుల్గాం అటవీ మార్గంలో టెర్రిరిస్టు గ్రూప్‌ల కార్యకలాపాలకు కఠారియా సహకరించాడు. అలానే పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీన.. మతం ఏంటీ? అని అడిగి మరీ 25 మంది హిందూ పర్యాటకులను చంపేసిన ఉగ్రవాదులకు కఠారియానే అన్నీ సమకూర్చాడు. అందుకే.. అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
#BreakingNews | 1st big arrest in #PahalgamTerrorAttack
– Key LeT operative Mohammad Kataria arrested.
– Kataria gave logistical support to terrorists.
– Sources: Helped terrorists to move in forests. #IndiaFirst | @gauravcsawant @MirFareed2 pic.twitter.com/AhaeNFt4Ty— IndiaToday (@IndiaToday) September 24, 2025
పహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్లకు సామగ్రి సమకూర్చారని జూన్ నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూలైలో భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ మహదేవ్’ (Operation Mahadev)లో ముగ్గురు లష్కరే ప్రధాన ఉగ్రవాదులు సులేమాన్ షా, అఫ్గన్, జిబ్రాన్‌లు హతమయ్యారు. ఈ ముగ్గురు పహల్గాం దాడిలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వెల్లడించారు.