Mayawati | తమిళనాడు బీఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె పార్టీ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ తో కలిసి చెన్నైలో ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు విచారణను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అందువల్లే ఇప్పటి వరకూ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పారు.
బాధితుడికి న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తమిళనాడులో శాంతిభద్రతలు అదుపులో లేవని తేలిపోయిందన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య వల్ల దళిత నేతలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!