ప్రచారం: ‘ఈ ఏడాది మార్చి నుంచి ఏటీఎంల్లో రూ.500 నోట్లు కన్పించవు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటున్నది.’ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం విపరీతంగా వైరల్ అవుతున్నది.
వాస్తవం: రూ.500 నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారమంతా తప్పు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. రూ.500 నోట్ల ఉపసంహరణపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. పౌరులు ఈ నోట్లపై ఎలాంటి ఆందోళన పడకుండా యథావిధిగా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నది.