AirTags | న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ‘యాపిల్’ తయారు చేస్తున్న గొప్ప ఉత్పత్తుల్లో ఎయిర్‌ట్యాగ్ ఒకటి. ఇండ్లలోనో లేక ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయిన వస్తువులను గుర్తించేందుకు ఉపయోగపడే ఈ ట్రాకింగ్ డివైజ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. కానీ, దీని వల్ల చిన్నపిల్లలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదట.
ఈ నేపథ్యంలో ఎయిర్‌ట్యాగ్‌లను చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలని ‘యాపిల్’ సూచిస్తున్నది. ఎయిర్ట్యాగ్లో ఉండే కాయిన్-సెల్ బ్యాటరీని మింగితే తీవ్ర ముప్పు లేదా ప్రాణహాని ప్రమాదం ఉన్నదని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నది. ఈ మేరకు ఆ కంపెనీ ఎయిర్ట్యాగ్లతోపాటు వాటి ప్యాకెట్లపైన, బ్యాటరీ కంపార్ట్మెంట్లో వార్నింగ్ సింబల్స్ పెట్టినట్టు అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వెల్లడించింది.