న్యూఢిల్లీ : తొలి అంతరిక్ష యాత్రికుడు హనుమంతుడు అని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో జరిగిన జాతీయ రోదసీ దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అంతరిక్షానికి వెళ్లిన మొదటి వ్యక్తి ఎవరు? అని అడిగారు.
కొందరు విద్యార్థులు స్పందించి, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని చెప్పారు. అనురాగ్ మాట్లాడుతూ, తాను ఆంజనేయుడు అనుకుంటున్నానని చెప్పారు. అనురాగ్ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. వాస్తవానికి సోవియెట్ కాస్మొనాట్ గగారిన్ 1961లో అంతరిక్షంలో అడుగు పెట్టారు.