Kavach System: ఒడిశా రైలు ప్రమాదం.. ఆ రూట్లో కవచ్ లేదన్న రైల్వేశాఖ
Kavach System: కవచ్ వ్యవస్థ లేకపోవడం వల్లే.. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం భీతావాహంగా మారినట్లు అర్ధమవుతోంది. భువనేశ్వర్, కోల్కతా రూట్లో కవచ్ వ్యవస్థ లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఒకవేళ కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం ఈస్థాయిలో ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
న్యూఢిల్లీ: రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు ప్రత్యేక కవచ్ వ్యవస్థ(Kavach System)ను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒడిశాలో జరిగిన భీకర రైలు ప్రమాదం 261 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మూడు రైళ్లు ఢీకొన్న సమయంలో కవచ్ వ్యవస్థ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రూట్లో యాంటీ కొలిజన్ వ్యవస్థ అయిన కవచ్ సిస్టమ్ లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని భారతీయ రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.
రైలు ప్రమాదాలను నివారించేందుకు దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను రైల్వేశాఖ ఇన్స్టాల్ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం బాలాసోర్ వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. బహుశా సిగ్నల్ వైఫల్యం అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కవచ్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదం చాలా తీవ్రంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

