బెంగళూరు: దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి (Anti BJP wave) వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బీజేపీపై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) వ్యాఖ్యానించారు. మైసూరులో ఓ కార్యక్రమానికి హాజరైన సిద్ధరామయ్యను అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకోవడంపై మీడియా ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు.
‘దేశవ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత మొదలైంది. ఎందుకంటే గడిచిన తొమ్మిదేళ్లలో వాళ్లు (బీజేపీ పాలకులు) కేవలం రాజకీయాలు మాత్రమే చేశారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని విడగొట్టారు. నిజం తెలుసుకున్న తర్వాత చాలా పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వస్తున్నాయి’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
Mysuru | On AIADMK breaking alliance with BJP and NDA, Karnataka CM Siddaramaiah says, “Anti-BJP wave has started in the whole nation because, in the past 9 years, they (BJP) have just done politics and have broken the society. After knowing this truth, many parties have stepped… pic.twitter.com/oN5rVGcbPL
— ANI (@ANI) September 26, 2023