ముంబై, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): మరాఠా కోటా కోసం మరో యువకుడు బలిదానం చేశాడు. శీతాకాల సమావేశాల్లో మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోక పోవడంతో, ఆందోళనకు గురైన ఒక యువకుడు పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన పోతబుద్రుక్లో జరిగింది. మృతుడి పేరు యోగేశ్ కుండ్లిక్ లోన్ సన్నే(21) అని పోలీసులు తెలిపారు. యోగేశ్ పర్భానిలోని ఓ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మరాఠా రిజర్వేషన్ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. హింగోలిలో మనోజ్ జరాంగే పాటిల్ సమావేశంలో అతను వలంటీర్‌గా కూడా పనిచేశాడు.