న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధి నాయకురాలు మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నటి కోయెల్ మల్లిక్ గురువారం తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఢిల్లీలో కలిసిన వెంటనే ఆమె తన రాజీనామాను ప్రకటించారు.
నాలుగు నెలల క్రితమే ఆమె ఎంపీగా నామినేట్ అయ్యారు.తన రాజీనామాకు గల కారణాన్నివెల్లడించలేదు. పార్లమెంట్ సమావేశాలు జరగడానికి నాలుగు రోజుల ముందు ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామంగా మారింది.