శనివారం 23 జనవరి 2021
National - Nov 28, 2020 , 13:07:52

బంగాళాఖాతంలో మరో తుఫాను

బంగాళాఖాతంలో మరో తుఫాను

చెన్నై : నివర్‌ తుఫాను ప్రభావం నుంచి కోలుకోక ముందే బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతోంది. వచ్చే నెల 2న తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి తుఫానుగా మారుతుందని తమిళనాడు విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. గత రెండు రోజుల కింద వచ్చిన నివర్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. సుమారు వెయ్యికిపైగా చెట్లు నేలకూలాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 


logo