న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన దాడిలో మరొక భారతీయుడు మృతి చెందాడు. ఈ నెల 2న తెల్లవారుజామున వాషింగ్టన్లోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన వివేక్ అనే యువకుడికి ఓ వ్యక్తితో వాగ్వాదం చోటు చేసుకున్నది. ఆ వ్యక్తి తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వివేక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే దవాఖానకు తరలించారు. ఈ నెల 7న వివేక్ తుది శ్వాస వదిలాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.