గాంధీనగర్, జూన్ 10: గుజరాత్‌లోని కుల దురహంకారుల దాడిలో మరో దళితుడు హత్యకు గురయ్యాడు. హోటల్లో మీల్స్ ప్యాకెట్ విషయంలో చోటుచేసుకున్న చిన్న వాగ్వాదం ఓ దళితుడి ప్రాణాలు తీసింది. ఆటోరిక్షా కార్మికుడు వెంకట్‌ను కులం పేరుతో దూషిస్తూ, హోటల్ నుంచి బయటకు లాగి హోటల్ యజమాని, అతడి సిబ్బంది విచక్షణారహితంగా కొట్టారు.
మహిసాగర్ జిల్లా, బాకోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దళితుడు వడోదరాలోని ఎస్ఎస్జీ దవాఖానాలో చికిత్సపొందుతూ శనివారం మరణించాడు. ఇది కుల దురహంకారుల హత్య, దీనిపై విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షంచాలని దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.