IED Blast | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కోబ్రా యూనిట్లో పని చేస్తున్న మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాక్‌కు కాళ్లకు గాలయ్యాయయి. వెంటనే వారిని బీజాపూర్ ఆసుప్రతికి తరలించారు. అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు రెఫర్ చేశారు. సమాచారం మేరకు.. బసగూడ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో పుట్కేల్ క్యాంప్ నుంచి సీఆర్పీఎస్, కోబ్రా సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 12న జంగ్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జాగూర్ సమీపంలో నక్సలైట్లు ఐఈడీని పేల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు డీఆర్జీ సైనికులు గాయపడగా.. ఇద్దరినీ చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు.