కోయంబత్తూర్: అధిష్ఠానంతో విభేదాలున్నాయన్న వార్తల వేళ బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మంగళవారం ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు నబిన్ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశం ఉందని బీజేపీ నాయకులు తెలిపారు.
మరోవైపు ఆయన త్వరలో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చవచ్చని సన్నిహితులు తెలిపారు. కోయంబత్తూర్లో ఆయన అభిమానులు పెట్టిన పోస్టర్లు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ‘మమ్మల్ని ముం దుండి నడిపించు’ అనే నినాదం ఆ పోస్టర్లలో రాసి ఉంది.