జైపూర్, నవంబర్ 2: రాజస్థాన్లోని ప్రసిద్ధ పుష్కర్ జంతు ప్రదర్శనలో రూ.21 కోట్ల విలువైన దున్నపోతు మృతి చెందింది. ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచి ప్రతి దినం వేలాది మందిని ఆకర్షించిన ఈ దున్న ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మరణించిందని అధికారులు తెలిపారు. అత్యంత విలువైన ఈ దున్నను అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ప్రదర్శనకు తీసుకువచ్చారు.
అయితే దీని ఆరోగ్యం క్షీణించడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వైద్య బృందాన్ని రప్పించారు. వారు చికిత్స చేసినప్పటికీ ఆరోగ్యం క్షీణించి మరణించింది. కాగా, అధికారుల చర్యను పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యాపారం పేరుతో జంతు హింసకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు.