శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 01:45:19

ప్రధాని మోదీతో ఏపీ సీఎం భేటీ

ప్రధాని మోదీతో ఏపీ సీఎం భేటీ
  • ఏపీకి ఆహ్వానించిన జగన్‌

న్యూఢిల్లీ/ అమరావతి, ఫిబ్రవరి 12: ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  బుధవారం గంటన్నరకుపైగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రధానికి జగన్‌ నివేదించారు. మూడు రాజధానులు, విభజన అంశాలు, ప్రత్యేక హోదా తదితర పది అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉగాది రోజున (మార్చి 25న) 25 లక్షల ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతామని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మోదీని జగన్‌ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇండ్లు అందజేయాలనే ఉద్దేశంతో ఇండ్లస్థలాలు పంపిణీచేయనున్నట్టు తెలిపారు.
logo