ఆజాద్ వర్సెస్ ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌లో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్‌సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ బరిలో దిగుతున్నారు.
- అనంతనాగ్‌లో రసవత్తర పోటీ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్‌సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ బరిలో దిగుతున్నారు. ఇక ఇండియా కూటమి తరఫున నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ పడుతున్నారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరాకు చెందిన ముఫ్తీ తాను పోటీ చేసే స్థానాన్ని ఆదివారం ప్రకటించారు. గతంలోనూ ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచిన ఆమె తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక 2022లో కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ స్థాపించిన గులాం నబీ ఆజాద్ ప్రధాన పోటీదారుగా బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన జస్టిస్ హస్నైన్ మసూది గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రెండు, ముఫ్తీ మూడో స్థానంలో నిలిచారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇటీవల వరకు ఇండియా కూటమి భాగస్వామిలో ఉన్నప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తు విచ్ఛిన్నమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

