ముంబై: మహేంద్ర గ్రూపు చైర్మెన్ ఆనంద్ మహేంద్ర(Anand Mahindra).. తన సోషల్ మీడియా అకౌంట్లో కొత్త వీడియో పోస్టు చేశారు. తరుచూ ఏదో ఓ కొత్త ప్రదేశానికి వెళ్తూ అక్కడి అందాలను తన వీడియోల్లో ఆయన పోస్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదేశ్వరాలయం వీడియోను తన ఎక్స్‌లో పోస్టు చేశారు. భారత్‌లో వివిధ ఆలయాలను దర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నో సుందర ప్రదేశాల గురించి స్టోరీలను పోస్టు చేస్తూనే ఉన్నానని, కానీ దేశంలో ఆలయాలను దర్శించడం విలువైన అంశమన్నారు. అదో ఆధ్యాత్మిక పర్యటన కన్నా ఎక్కువే అన్నారు. దేశంలోని ఆలయాలు అత్యంత సుందరంగా ఉన్నట్లు చెప్పారు. ఆలయానికి వెళ్లడం అంటే ప్రపంచంలోని ప్రాచీన ఇంజినీరింగ్ కళను అన్వేషించడమే అవుతుందన్నారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 1003 నుంచి 1010 మధ్య కాలంలో నిర్మించారని, గ్రానైట్‌తో దీన్ని నిర్మించారని, ఇంటర్‌లాకింగ్ స్టోన్ టెక్నిక్ ద్వారా శిలలను కలిపారని, వెయ్యేళ్లుగా ఆ కట్టడం ఎన్నో భూకంపాలను తట్టుకున్న ఆనంద్ మహేంద్ర తన ట్వీట్లో తెలిపారు.
సోషల్ మీడియాలో యూజర్లు స్పందించారు. ఆనంద్ మహేంద్ర మనోభావాలకు లైక్ కొట్టేశారు. కామెంట్లతో హోరెత్తించారు. బృహదీశ్వర ఆలయాన్ని.. తమిళ ప్రజలు పెరియా కోవిల్ అని పిలుస్తారు. అంటే అతిపెద్ద ఆలయం అని అర్థం. భారతీయ సంపన్నమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ఆ నిలయాన్ని నిదర్శనంగా భావిస్తారు. చోళ చక్రవర్తి మొదటి రాజరాజ ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్రవిడ సంస్కృతికి చిహ్నంగా మారింది. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. గర్భగుడిపై గ్రానైట్ గోపుం సుమారు 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. తాంజావూరు వినువీధిని తాకుతున్నట్లుగా ఆ గొపురాన్ని నిర్మించారు.
I’ve been posting stories about exotic locations & landscapes, but touring the great temples of India is a worthy obsession in itself…
Visiting them is more than a spiritual trip; the temples are visually breathtaking.
But it’s also an exploration of the world’s most… pic.twitter.com/jCOeymNtPD
— anand mahindra (@anandmahindra) December 28, 2025